NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది
    తదుపరి వార్తా కథనం
    Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది
    Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది

    Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది

    వ్రాసిన వారు Stalin
    May 18, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చట్ట సభల్లో క్రమశిక్షణా రాహిత్యం వెల్లు విరుస్తోంది. ఇందుకు మేము మినహాయింపు కాదని నిరూపించుకుంది తైవాన్ పార్లమెంట్‌.

    ఇక్కడి పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది.

    కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    దీంతో వివాదం ముష్టిఘాతాల స్థాయికి చేరుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడానికి ఎంపీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదన పార్లమెంటులో చర్చకు వచ్చాయి.

    ఈ సమయంలో ఎంపీల మధ్య గొడవ జరిగింది. ఎంపీలు ఫైళ్లను లాక్కొని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.

    Details 

    లై చింగ్-తే పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు..

    మరొక వీడియోలో కొంతమంది ఎంపీలు స్పీకర్ సీటును చుట్టుముట్టారు.చాలా మంది టేబుల్‌పైకి దూకడం, మరి కొందరు తమ సహోద్యోగులను నేలపైకి లాగడం వంటి దృశ్యాలు కనిపించాయి.

    అధ్యక్షుడిగా ఎన్నికైన లై చింగ్-తే శాసనసభ మెజారిటీ లేకుండా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందు ఈ వివాదం జరిగింది.

    పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు చేసే అధికారులను నేరంగా పరిగణించే కొత్త తీర్పుపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP),కోమింటాంగ్ (KMT) పోరాడుతున్నట్లు తెలిసింది.

    Details 

    ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే వివాదం

    సభ్యులు సభలోకి రాకముందే చర్చ వాడివేడిగా మారి సభ వెలుపల సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

    జనవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచినప్పటికీ లై డీపీపీ పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే వివాదం నెలకొంది.

    ప్రతిపక్ష కెఎమ్‌టీకి డీపీపీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయని, అయితే మెజారిటీని ఏర్పాటు చేయడానికి సరిపోదని నివేదిక పేర్కొంది.

    పార్లమెంట్‌లోని 113 స్థానాల్లో ఎనిమిది స్థానాలను తమ ఆధీనంలో ఉంచుకున్న టీపీపీతో కలిసి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తైవాన్

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    తైవాన్

    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  ఆపిల్
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల చైనా
    Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు  చైనా
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025