Page Loader
లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇంగ్లండ్‌లోని ఛారిటీ కమిషన్‌లో నమోదైన శ్రీ జగన్నాథ సొసైటీ వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే, లండన్‌లో ఇదే మొదటి జగన్నాథుడి కోవెల అవుతుంది.

లండన్

'ఫిన్‌నెస్ట్' గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు బిశ్వనాథ్ పట్నాయక్ భారీ విరాళం

లండన్‌లో శ్రీ జగన్నాథ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన మొదటి శ్రీ జగన్నాథ కన్వెన్షన్‌లో ప్రముఖ వ్యాపార వేత్త బిశ్వనాథ్ పట్నాయక్ ఆలయ నిర్మాణానికి 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. బిశ్వనాథ్ పట్నాయక్ 'ఫిన్‌నెస్ట్' గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు. 'ఫిన్‌నెస్ట్' కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కర్‌ కూడా తన వంతు సాయం ప్రకటించారు. శ్రీ జగన్నాథ మందిర్ లండన్ అని పిలవబడే కొత్త ఆలయం 15 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి 'ఫిన్‌నెస్ట్' కంపెనీ 7 మిలియన్ ఫౌండ్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరుణ్ కార్ వెల్లడించారు. మందిర్ నిర్మాణానికి అనుమతిని పొందేందుకు స్థానిక ప్రభుత్వ మండలికి ముందస్తు ప్రణాళిక దరఖాస్తును సమర్పించినట్లు శ్రీ జగన్నాథ సొసైటీ పేర్కొంది.