Ukraine crisis: ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భారత్, చైనా సహకారం కీలకం: ఇటలీ ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా మిన్నంటుతుండగా, ఈ వివాదం పరిష్కారం కోసం పలు దేశాలు శాంతి స్థాపన ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, రష్యా-ఉక్రెయిన్ వివాద పరిష్కారంలో భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయని విశ్యాసం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణంపై 2024లో జరగనున్న సమావేశానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఇటలీ పర్యటనలో మెలోనిని కలిసిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్ కి ఇటలీ మద్దతు
ఈ సమావేశంలో ఇటలీ ఉక్రెయిన్‌కి తన మద్దతు ప్రకటించింది. మెలోని మాట్లాడుతూ, జాతీయ సమగ్రత, ప్రయోజనాల పరిరక్షణలో ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి ఇటలీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వివాద పరిష్కారంలో భారత్, చైనా వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని మెలోని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనలో భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం చేయగలవని పేర్కొన్న సంగతి తెలిసిందే.