Covid-19 in US : అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. నాలుగు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ
అమెరికాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. యూఎస్ అంతా డిసెంబర్ 17 నుంచి 23 వరకు కోవిడ్ కారణంగా 29వేల మంది రోగులు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఇదే సమయంలో 14,700 మంది రోగులు జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఇక న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మాసాచుసెట్స్ లోని ఆస్పత్రుల్లో రోగులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ పేర్కొంది.
కరోనా జెఎన్ 2 వేరియంట్ కేసులపై అమెరికా ఆందళన
మరోవైపు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం.. అమెరికాలో కరోనా కారణంగా 11 లక్షల మంది రోగులు మృత్యువాత పడ్డారు. గతవారం న్యూయార్క్ నగరంలోని 11 ప్రభుత్వ ఆస్ప్రతులకు మాస్కలు ధరించాలని చెప్పింది. ఇక పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో పాటు జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా జెఎన్ 1 వేరియంట్ కేసులపై కూడా అమెరికా ఆందోళన చేసింది.