LOADING...
రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు 
రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు

రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు 

వ్రాసిన వారు Stalin
Sep 13, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణల కేసులో జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు ఆయన తరపు న్యాయవాది బుధవారం తెలిపారు. కస్టడీని సెప్టెంబరు 26వరకు పొడిగించినట్లు న్యాయవాది నయీమ్ పంజుత ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతకుముందు తోషాఖానా కేసులో ఇమ్రాన్ దోషిగా తేలడంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఆగస్టు ప్రారంభంలో అరెస్టు అయిన ఆయన అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు. తాజాగా తోషాఖానా కేసులో పడిన శిక్షను గత నెలలో హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ రహస్యాల కేసులో అతన్ని మళ్లీ రిమాండ్‌లో ఉంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు వారాల పాటు కస్టడీ పొడిగింపు