Page Loader
Nigeria Floods: నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి
నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి

Nigeria Floods: నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

నైజీరియాను మరోసారి భారీ వరదలు కబళించాయి. గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో భయానక స్థితి నెలకొంది. ముఖ్యంగా ఓ డ్యామ్ కూలిపోయిన ఘటనతో విపత్తు మరింత ఘోరంగా మారింది. వరద ఉధృతి ఎక్కువగా మారడంతో ఇళ్లు, వాహనాలు, సాధారణ ప్రజలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 111 మృతదేహాలను వెలికితీయగా... మరికొంతమంది గల్లంతైన అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులై సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదే తరహాలో గత సెప్టెంబర్లోనూ నైజీరియా తీవ్రమైన వరదలను చవిచూసింది.

Details

నిరాశ్రయులుగా మారిన లక్షలాది మంది

అప్పుడు కూడా ఆనకట్టలు తెగిపోవడంతో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. దేశం ఇప్పటికే బోకో హరామ్ తీవ్రవాద చర్యలతో మానవతా సంక్షోభంలో తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో... వరదలతో పరిస్థితి మరింత విషమంగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావంతో నైజీరియాలో తరచూ తీవ్రమైన వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే మితిమీరిన వర్షపాతం వలన భారీ నష్టాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా అలాంటి వర్షాలే దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురవడంతో విపత్కర పరిస్థితులు తలెత్తాయి.