Page Loader
భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన
భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

వ్రాసిన వారు Stalin
Apr 04, 2023
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్‌)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐడ్రాప్స్‌లో ఏ మందుకు లొంగని ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా' ఉన్నట్లు గుర్తించింది. ఈ బ్యాక్టీరియా ద్వారా ఇప్పటికే మూడు మరణాలు సంభవించాయి. ఎనిమిది కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. చెన్నైకి దక్షిణాన 40కి.మీ దూరంలో ఉన్న గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్న ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్(EzriCare Artificial Tears) ఐడ్రాప్స్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు.

అమెరికా

ఈ రకమైన బ్యాక్టీరియాకు చికిత్స చేయడం కష్టమే: వైద్య నిపుణులు

ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్‌ను వాడొద్దంటూ ఫిబ్రవరిలోనే అమెరికా ఆదేశాలు జారీ చేయగా, ఆ ఉత్పత్తులను కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి అందులో ఉన్న బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయగా, తాజాగా అందులో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా' ఉన్నట్లు గుర్తించారు. ఈ రకమైన బ్యాక్టీరియాకు చికిత్స చేయడం కష్టమని వైద్య నిపుణులు చెప్పారు. బ్యాక్టీరియా రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. సూడోమోనాస్ ఎరుగినోసా('డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా) అనే బ్యాక్టీరియా రక్తం, ఊపిరితిత్తులు లేదా గాయాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అంధత్వం రావొచ్చు. అలాగే మరణానికి కూడా దారితీయవచ్చు.