Suicide Pod: బటన్ నొక్కిన వెంటనే మరణం.. సూసైడ్ పాడ్ ద్వారా అమెరికన్ మహిళ ఆత్మహత్య
స్విట్జర్లాండ్‌లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ సార్కో పాడ్ అనే 'సూసైడ్ ప్యాడ్' ద్వారా ఆత్మహత్య చేసుకుంది, దీని ద్వారా ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆత్మహత్యకు సహకరించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమెరికన్ మహిళ సోమవారం స్విట్జర్లాండ్‌లో పొరటబుల్, 3డి-ప్రింటెడ్ ఛాంబర్‌ని ఉపయోగించి తన ప్రాణాలను తీసుకుంది. సార్కో ఫాగస్ అనేది ఓ వివాదాస్పదమైన సూసైడ్ పాడ్. దీనిలో లోపలికి వెళ్లి బటన్ నొక్కిన వెంటనే మరణం సంభవిస్తుంది.
మెరిచౌసెన్ అటవీ ప్రాంతంలో ఘటన
స్విస్-జర్మన్ సరిహద్దు సమీపంలోని మెరిచౌసెన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ క్యాప్సూల్‌ను మొదటిసారిగా ఉపయోగించారు. ఈ సంఘటనపై స్విస్ న్యాయ సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. పాడ్ వినియోగంపై చట్టపరమైన అభ్యంతరాలు లేనప్పటికీ, దీనిని మొదటిసారిగా ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది.