Mohammed Deif: హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ దుర్మరణం
కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ పోరాడుతున్న హమాస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం కూడా మృతి చెందాడు. ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ గురువారం స్పష్టం చేసింది. మిస్సైల్ దాడుల్లో డీఫ్ చనిపోయినట్లు ద్రువీకరించింది. అతను అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై జరిగిన దాడికి సూత్రదారిగా ఉన్నాడు.
మోస్ట్ వాంటెడ్ లిస్టులో డీఫ్
జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో మహ్మద్ డీఫ్, రఫా సలామెహ్ ఉన్న కాంపౌండ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు విడిచినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ ఏడుసార్లు డీఫ్ ను హతమార్చేందుకు ప్రయత్నించింది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో డీఫ్ ఉన్నాడు. గతంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇజ్రాయిలులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక డీఫ్ హస్తం ఉందని గతంలో నిరూపణ అయింది.