గాజాలోకి ఇజ్రాయెల్ దళాలు ఎంటరైతే 5 సవాళ్లు ఎదురవుతాయి.. ఉక్రెయిన్ లోనూ అదే జరిగింది
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటైన గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ భూ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు శనివారం భారీ ఉగ్రదాడిని ప్రారంభించిన హమాస్ గ్రూపుతో పోరాడేందుకు ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై భూదాడికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ ప్రకటించింది. అయితే తమ దేశ రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం తుది ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు ఊహకు అందని విధంగా మెరుపు దాడులతో కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లను ప్రయోగించి బీభత్సం సృష్టించారు. దాడులను ముందే పసిగట్టి, ప్రజలను రక్షించడంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం,ఇంటెలిజెన్స్, మిలిటరీ విఫలమయ్యాయని ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ భూ బలగాలకు 5 వ్యూహాత్మక సవాళ్లు
1. గాజా స్ట్రిప్‌లోని భవనాలు ఇరుకుగా పక్కపక్కనే ఉన్నాయి. వీధులు సైతం చిన్నగా ఉన్నాయి. సాయుధ సిబ్బంది క్యారియర్లు (IFVలు), పదాతిదళ పోరాట వాహనాలు (IFVలు), ట్యాంకులు, బాంబులు, గాజా స్ట్రిప్‌లో నావిగేట్ చేయడం కష్టంగా మారింది. 2. చిన్న ప్రదేశాల్లో బూబీ ట్రాప్‌లు, ఇజ్రాయెల్ దళాలకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. హమాస్ గ్రూపు వారున్న భవనాలను ఒక్కొక్కటిగా తనిఖీ చేయడం సవాల్ తో కూడుకుంది. గాజాలో చీకటి కిటికీలతో ఉన్న ఎత్తైన భవనాల వద్ద నుంచి ఏ దిశ నుంచైనా ప్రతిదాడులు జరగొచ్చు.
ప్రజల ప్రాణ నష్టాన్ని కుదించడం సవాల్ తో కూడుకున్న వ్యవహారం
3. ట్యాంక్ వ్యతిరేక గైడెడ్ క్షిపణులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లు (RPGలు) చిన్న బృందాల ద్వారా పెద్ద యాంత్రిక శక్తి గల పదాతిదళం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.సిరియా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇదే జరిగింది. 4. హమాస్ గ్రూపునకు మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPADS) ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెలికాప్టర్‌లతో యుద్దం చేయడం ప్రమాదకరం. ట్రూప్-ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్‌లు చాలా తక్కువ స్థాయిలో ఎగురుతాయి. మరోవైపు సరైనా కమాండ్ కంట్రోల్ లేని RPGలు సైతం ప్రమాదకరం. 5. ఇజ్రాయెల్ దళాలు పూర్తిస్థాయి దాడి కోసం గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశిస్తే ప్రజల ప్రాణ నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించడం సవాలుగా మారుతుంది.