NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: ఖవాజా ఆసిఫ్‌

    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

    భారతదేశం డ్రోన్లను పంపిన తర్వాత,వాటిని తమ సైన్యం గగనతలంలోనే గుర్తించి కూల్చివేసిందని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఒక రోజు తర్వాతే రక్షణమంత్రి ఈ ప్రకటన చేశారు.

    అయితే అసలు వాస్తవాన్ని బయటపెట్టుతూ,భారత డ్రోన్లను అడ్డుకోలేకపోయామని స్వయంగా ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు.

    "మన గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైంది. భారత దాడులు మన రక్షణ వ్యవస్థను తునాతునకలు చేశాయి.మన రక్షణ శాఖ పూర్తిగా విఫలమైందని నిశ్చయంగా చెప్పగలను.ఇంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను, ఎందుకంటే ఇది గోప్యత పరమైన అంశం,"అని ఆసిఫ్‌ పార్లమెంట్ సమావేశంలో ఉద్ఘాటించారు.

    వివరాలు 

    తెహ్రీక్-ఇ-తాలిబాన్‌ ఆధ్వర్యంలో 20 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు

    ఈ వ్యాఖ్యలు వెల్లడి కావడంతో ప్రతిపక్ష పార్టీ,ముఖ్యంగా పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)నేతలు ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.

    ప్రస్తుత పాలకులు అసమర్థులని, దేశ రక్షణ విషయంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

    ఇప్పటికే పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఒకవైపు భారత సైన్యం దాడులతో దేశం అల్లకల్లోలంగా మారుతున్నదంటే, మరోవైపు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) దాడులతో సైన్యానికి ఊపిరి పోసుకోవడమే కష్టంగా మారింది.

    అలాగే తెహ్రీక్-ఇ-తాలిబాన్‌ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 20 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ పరిస్థితుల నడుమ, దేశ ప్రధానిని కూడా సభ్యులు లక్ష్యంగా చేస్తున్నారు.

    వివరాలు 

    ప్రధాని నివాసానికి సమీపంలో భారత దళాలు దాడులు

    పార్లమెంట్‌లో అనేక మంది ఎంపీలు షెహబాజ్‌ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఒక పిరికిపంద అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    భారత సైన్యం దాడుల నేపథ్యంలో పాక్‌లో సామాన్యులే కాదు,రాజకీయ నాయకులు కూడా భయంతో వణికిపోతున్నారు.

    మాజీ రిటైర్డ్‌ మేజర్‌, ప్రస్తుత సీనియర్ ఎంపీ తాహిర్‌ ఇక్బాల్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతుండగా కంటతడి పెట్టిన దృశ్యం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

    అధికార పక్షానికి చెందిన ఆయన, భారత దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    అంతేకాకుండా,ఇస్లామాబాద్‌లోని ప్రధాని నివాసానికి సమీపంలో భారత దళాలు దాడులు జరిపినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన నివాసాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పార్లమెంట్ లో మాట్లాడుతున్న పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌

    “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”

    This isn’t parody, this is scene from Pakistani parliament

    Pakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA

    — BALA (@erbmjha) May 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష జేపీ నడ్డా
    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు రాజస్థాన్

    పాకిస్థాన్

    Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ భారతదేశం
    Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్‌ క్షిపణి ప్రయోగం ప్రపంచం
    India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత కేంద్ర ప్రభుత్వం
    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025