LOADING...
Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం
ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం

Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చర్చల అవసరముందని మరోసారి అంతర్జాతీయ శక్తులు సూచించాయి. ఇప్పటికే అమెరికా, చైనా భారత్‌కు చర్చల మార్గాన్ని సూచించగా.. తాజాగా రష్యా కూడా అదే దిశగా స్పందించింది. ఈ అంశంపై రష్యన్‌ ఫెడరేషన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ- 'భారత్, పాక్ మధ్య నెలకొన్న వివాదాలను ప్రత్యక్షంగా చర్చించుకుని శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నాం. పరస్పర విశ్వాసంతో ఇరుదేశాలు ముందుకు సాగాలని అభిప్రాయపడారు. ఇక తాజాగా జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగా.. అమెరికా ఈ విషయంపై స్పందించింది. ఇరుదేశాల మధ్య విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, మోదీ-షరీఫ్‌ శాంతి మార్గాన్ని ఎంచుకోవడం అభినందనీయమని పేర్కొంది.

Details

కశ్మీర్ అంశాన్ని చర్చల్లో పెట్టాలి : పాక్

భారత్‌, పాక్‌ల మధ్య సుస్థిర శాంతిని సాధించేందుకు ప్రత్యక్ష చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అభిప్రాయపడ్డారు. చైనా నుంచి కూడా స్పందన వచ్చింది. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణను సమర్థిస్తున్నట్లు తెలిపింది. అయితే గతంలో పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనా, ఇప్పుడు సానుకూల ప్రకటన చేసింది. పాక్‌తో చర్చలు ద్వైపాక్షికంగానే జరుగుతాయని, ఉగ్రవాదంపై మాత్రమే చర్చలకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. తమది శాంతికోసమే అయినా, చర్చలలో కశ్మీర్ అంశాన్ని చేర్చాలని షరతు పెట్టారు. అంతర్జాతీయంగా భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీరాలని, శాంతి చర్చలే మార్గమని వాదనలు వినిపిస్తున్నాయి.