American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్లు
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే వారిలో జాబితాలో పలువురు భారతీయ-అమెరికన్ నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.
ట్రంప్‌పై రిపబ్లికన్ పార్టీ తరఫున భారతీయ అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, హర్షవర్ధన్ సింగ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కొన్ని క్రిమినల్ కేసుల్లో చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, ట్రంప్ నామినేషన్ రేసులో ముందంజలో ఉన్నారు.
రిపబ్లికన్లు తమ పార్టీ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ఎన్నుకునేందుకు వచ్చే జూలైలో జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జులై 15 నుంచి18 వరకు సమావేశం జరుగుతుంది.
అమెరికా
నిక్కీ హేలీ- సౌత్ కరోలినాకు రెండుసార్లు గవర్నర్
భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ(51) సౌత్ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారిగా పని చేశారు.
వరుసగా మూడో ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన మూడో భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ కావడం గమనార్హం.
హేలీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రంధవా, రాజ్ కౌర్ రంధవా. వీరు 1960లలో పంజాబ్ నుంచి కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చారు.
హేలీ 39 సంవత్సరాల వయస్సులో 2011లో ఆమె తొలిసారిగా గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అమెరికాలో అతి పిన్న వయసులో సౌత్ కరోలినాకు గవర్నర్‌గా చేసిన మహిళగా హేలీ చరిత్ర సృష్టించారు.
అమెరికా
వివేక్ రామస్వామి- 9శాతం మంది రిపబ్లికన్ల నేతల మద్దతు
భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి 2024అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
రిపబ్లికన్ పార్టీల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తర్వాత వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు.
హెల్త్‌కేర్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన వివేక్ రామస్వామికి 9శాతం మంది రిపబ్లికన్ పార్టీ నేతల మద్దతు ఉంది.
ట్రంప్‌కు 47శాతం ఓట్లు వచ్చాయి, ఇది డిసాంటిస్‌కు 19 శాతం కంటే చాలా ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారు.
రామస్వామి అమెరికాలోని ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కేరళలోని పాలక్కాడ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు.
రామస్వామి తండ్రి పేరు గణపతి రామస్వామి, వృత్తిరీత్యా ఇంజనీర్. అతని తల్లి, గీతా రామస్వామి, వృత్తిరీత్యా మానసిక వైద్యురాలు.
అమెరికా
భరతవంశీ హర్షవర్ధన్ సింగ్- ఏరోస్పేస్ ఇంజనీర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భరతవంశీ హర్షవర్ధన్ సింగ్ కూడా చేరారు.
ఏరోస్పేస్ ఇంజనీర్ హర్ష్ వర్ధన్ తన జీవితాంతం రిపబ్లికన్‌గా కొనసాగుతానని ఒక వీడియోలో తెలిపారు.
న్యూజెర్సీలో రిపబ్లికన్ పార్టీ సంప్రదాయవాద విభాగాన్ని పునరుద్ధరించడంలో సింగ్ కీలక పాత్ర పోషించారు.
గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వచ్చాయని సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ మార్పులను అధిగమించడానికి, అమెరికన్ విలువలను స్థాపించడానికి బలమైన నాయకత్వం అవసరమని, అందుకోసమే తాను అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
2017, 2021లో న్యూజెర్సీ గవర్నర్ పదవికి, 2018లో ప్రతినిధుల సభకు, 2020లో రిపబ్లికన్ ప్రైమరీలలో సెనేట్‌కు పోటీ చేసినా, రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని సింగ్ గెలవలేకపోయారు.