LOADING...
Jeffrey Epstein: విలాసతవంతమైన గదులు,కళ్లు చెదిరే సౌకర్యాలు .. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!
ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!

Jeffrey Epstein: విలాసతవంతమైన గదులు,కళ్లు చెదిరే సౌకర్యాలు .. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపన్నుల వికృత క్రీడకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే విధంగా, ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పలు కీలక ఫోటోలు తాజాగా వెలుగుచూశాయి. ఆయన ప్రైవేట్ దీవిలో నిర్మించిన విలాస భవనాలు,అలాగే వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలకు సంబంధించిన దృశ్యాలను హౌస్ కమిటీ అధికారికంగా విడుదల చేసింది. బయటకు వచ్చిన చిత్రాల్లో రాజభోగానికి అద్దం పట్టేలా ఉన్న పడకగదులు,అధునాతన స్నానాల గదులు,అంతేకాదు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెంటల్ క్లినిక్ గది కూడా ఈ ఫొటోలలో కనిపిస్తోంది. ప్రతి గది అత్యంత ఖరీదైన రిసార్ట్‌లను తలపించే ఆకృతితో ఉండటం గమనార్హం.

వివరాలు 

బాధిత మహిళలకు న్యాయం లభించే వరకు పోరాటం: కమిటీ

భవనం ముందుభాగంలో విశాలమైన స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వంటి సదుపాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకునే విధంగా ఎప్‌స్టీన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు ఈ దృశ్యాలు చెబుతున్నాయి. ఈ ఫోటోలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం విచారణ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను నెలకొల్పడమేనని హౌస్ కమిటీ స్పష్టం చేసింది. ఎప్‌స్టీన్ కేసులో బాధిత మహిళలకు తగిన న్యాయం లభించే వరకు తమ పోరాటం ఆగదని కమిటీ స్పష్టమైన సందేశం ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంపన్నుల వికృత క్రీడలకు అనువుగా ఏర్పాట్లు చేసుకున్న ఎప్ స్టిన్ 

Advertisement