
Dominican: డొమినికన్ విషాదం.. నైట్‌క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో 184 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో జరిగిన భయానక ఘటనతో అక్కడి ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. జెట్‌సెట్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
తాజాగా అధికారిక సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 184కి చేరుకుంది. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్టు అంచనా వేస్తున్నారు.
ఈ క్లబ్‌లో మంగళవారం తెల్లవారుజామున ప్రముఖ మురాంగే గాయకుడు రూబీ పెరెజ్ సంగీత ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భవన పైకప్పు నుంచి పొడి క్షారించడం ప్రారంభమైంది. వెంటనే పెద్ద శబ్దంతో పైకప్పు కూలిపోవడంతో అనేకమంది అక్కడికక్కడే మృతి చెందారు.
Details
సహాయక చర్యలు నెమ్మదిగా జరగడంపై అసంతృప్తి
మొత్తం 184 మంది ఈ దుర్ఘటనలో మృతిచెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇప్పటివరకు మృతుల్లో 54 మందిని గుర్తించగా, వారిలో 28 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయకుడు రూబీ పెరెజ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు ధృవీకరించారు. బుధవారం ఆయన మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికితీసినట్టు సమాచారం.
ఇక ప్రమాదంలో తమ కుటుంబసభ్యులు మృతిచెందినట్టు గుర్తించిన బాధితులు మృతదేహాలను త్వరగా అప్పగించాలంటూ ఆందోళన చేస్తున్నారు.
సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నందుకు వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే అధికారులు మాత్రం సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని, ప్రజలు సహనంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.