NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం
    హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం

    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    09:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి మరో షాకిచ్చారు.

    ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి ఇచ్చే ఫెడరల్‌ నిధులను తగ్గించిన ఆయన,తాజాగా విదేశీ విద్యార్థులపై నిషేధం విధించారు.

    2025-26 విద్యా సంవత్సరానికి మించి హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.

    ఈమేరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాసారు.

    ఈఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇకపై కొత్తగా విదేశీ విద్యార్థులు ప్రవేశించలేరు.

    ఇప్పటికే చదువుతోన్న విదేశీ విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి మారాల్సి ఉంటుంది.

    లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.ఈ మార్గాల్లో ఏదీ అనుసరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోయెమ్ హెచ్చరించారు.

    వివరాలు 

    అధిక ఫీజుల ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం

    అంతేగాక, విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోడానికి అవసరమైన వీసా ప్రక్రియ, యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVIS) సర్టిఫికేషన్‌ను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

    ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

    హార్వర్డ్‌లో యూదు వ్యతిరేకత, హింసకు ప్రోత్సాహం, చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు నోయెమ్ తెలిపారు.

    విదేశీ విద్యార్థుల చేర్పు యూనివర్సిటీకి హక్కు కాదని, అది కేవలం ఒక అర్హత మాత్రమేనని స్పష్టం చేశారు.

    విదేశీ విద్యార్థులు చెల్లించే అధిక ఫీజుల ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకుంటున్నాయని ఎక్స్‌ వేదికగా చెప్పారు.

    వివరాలు 

    ట్రంప్‌ రెండోసారి ఎన్నికైన తర్వాత హార్వర్డ్‌పై ఒత్తిళ్లు

    ఇదిలా ఉండగా, ట్రంప్‌ నిర్ణయాన్ని హార్వర్డ్‌ యూనివర్సిటీ తీవ్రంగా ఖండించింది.

    ఇది చట్ట విరుద్ధమైన చర్య అని పేర్కొంది. దీని వల్ల యూనివర్సిటీకి, అమెరికా దేశానికి దీర్ఘకాలికంగా నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

    అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి ఎన్నికైన తర్వాత హార్వర్డ్‌పై ఒత్తిళ్లు పెరిగాయి.

    విశ్వవిద్యాలయం అడ్మిషన్ విధానాలు, ఆడిట్లు, స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపుల రద్దు వంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది.

    అయితే హార్వర్డ్‌ ఈ సూచనలను తిప్పికొట్టింది. తమ స్వతంత్రత, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది.

    తమ కార్యకలాపాలు చట్టబద్ధంగానే జరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరించాలని వర్సిటీ స్పష్టం చేసింది.

    వివరాలు 

    140 దేశాలకుపైగా విద్యార్థులు హార్వర్డ్‌లో ప్రవేశం

    ఈ నేపథ్యంలో, ఏప్రిల్‌లో హార్వర్డ్‌కి ఇవ్వాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను ట్రంప్ సర్కార్ స్తంభింపజేసింది.

    తరువాతి దశలో హార్వర్డ్‌కు కొత్తగా ఫెడరల్‌ గ్రాంట్లు మంజూరు చేయబోమని వెల్లడించింది.

    ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే వరకూ నిధులు ఇవ్వదని స్పష్టం చేసింది.

    తాజా నిర్ణయంగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం విధించింది. హార్వర్డ్‌ యూనివర్సిటీ అమెరికాలోనే ప్రముఖ, సంపన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి.

    ప్రతి సంవత్సరం 140 దేశాలకుపైగా విద్యార్థులు హార్వర్డ్‌లో ప్రవేశం పొందుతారు.

    కేవలం మసాచుసెట్స్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్ క్యాంపస్‌లోనే దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు.

    వీరిలో అధిక భాగం గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉండటం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం అమెరికా
    V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్  ఇస్రో
    Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య పాకిస్థాన్
    Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు  ప్రహ్లాద్ జోషి

    అమెరికా

    North Korea: ఉత్తరకొరియాలో కొత్త విధ్వంసక నౌక ప్రారంభం.. కిమ్‌ జోంగ్ ఉన్‌ కీలక ప్రకటన ఉత్తర కొరియా
    US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా డొనాల్డ్ ట్రంప్
    USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..!  అంతర్జాతీయం
    Trump tariffs: ట్రంప్​ టారిఫ్​ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి! డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025