LOADING...
Former First Buddy: మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..
మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..

Former First Buddy: మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ఒకే వేదికపై కనిపించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన కార్యకర్త, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ జ్ఞాపకార్థం ఆరిజోనాలోని ఒక స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చున్న వారు షేక్‌హ్యండ్‌ ఇచ్చుకున్నారు. ఇరువురూ కాసేపు చర్చించుకున్నారు.

అనుబంధం 

ట్రంప్‌-మస్క్‌ పాత అనుబంధం 

ట్రంప్‌ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు "డోజ్‌" అనే ప్రత్యేక విభాగాన్ని సృష్టించారు. ఆ విభాగానికి మస్క్‌ను అధిపతిగా నియమించారు. అయితే కొద్ది నెలల్లోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉత్పన్నం కావడంతో, మస్క్‌ గత మే 29న ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య మరింత దూరం పెరిగింది. ఇంత కాలం తరువాత మళ్లీ ఒకే వేదికపై కలవడం ఇదే తొలిసారి కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోను మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో "ఫర్‌ చార్లీ" అనే శీర్షికతో పోస్టు చేయగా, ఆ ఫొటోపై వైట్‌ హౌస్‌ కూడా స్పందించింది.

చార్లీ కిర్క్

చార్లీ కిర్క్‌ దారుణ హత్య 

ఈ నెల 10న ఉటా రాష్ట్రంలోని ఉటా వేలీ యూనివర్సిటీలో జరుగుతున్న మాస్‌ షూటింగ్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో చార్లీ కిర్క్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. సమీప భవనం పైకప్పు నుంచి జరిగిన ఒకే రౌండ్‌ బుల్లెట్‌ కిర్క్‌ మెడను తాకింది. తీవ్ర గాయాలైన అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా కలకలం రేపింది.

వివరాలు 

భారత వ్యతిరేక వైఖరి 

చార్లీ కిర్క్‌ చాలా కాలంగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదాస్పదుడిగా మారాడు. భారతీయులకు వీసాలు ఇవ్వకూడదని బహిరంగంగా ప్రచారం చేసిన ఆయన, మే 8న నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో కూడా అదే దృక్పథాన్ని ప్రదర్శించాడు. భారత వలసదారులపై విమర్శలు గుప్పించిన ఆయన, భారత్‌-పాక్‌ మధ్య జరుగుతున్న "ఆపరేషన్‌ సిందూర్‌"ను ఆపాలని ట్రంప్‌ను బహిరంగంగా కోరాడు. బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన పాకిస్థాన్‌ మోసపూరితమైనదని, ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరు జరుపుతున్న భారత్‌కు యూఎస్‌ కొద్దిగా మద్దతు తెలపవచ్చని, కానీ అది నైతిక మద్దతు కంటే ఎక్కువ ఉండరాదని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పందించిన వైట్ హౌస్