Page Loader
'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Stalin
Aug 21, 2023
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే భారత్‌పై పరస్పర పన్ను విధానాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. అమెరికన్ ఉత్పత్తులపై ప్రత్యేకించి ప్రఖ్యాత హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లపై భారతదేశం అధిక పన్ను విధించే అంశాన్ని ట్రంప్ మరోసారి లేవనెత్తారు. ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ భారతదేశం ఎలివేటెడ్ పన్ను రేట్ల విధానాన్ని విమర్శించారు. భారత్ చాలా ఎక్కువగా టారీఫ్ వసూలు చేస్తోందని చేప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో భారతదేశాన్ని 'టారిఫ్ కింగ్'గా ట్రంప్ అభివర్ణించారు.

పన్ను

ట్రంప్ హయాంలో భారత్ రీజనబుల్ మార్కెట్ యాక్సెస్‌ రద్దు 

మే 2019లో అమెరికాకు భారత్ సరసమైన మార్కెట్ యాక్సెస్‌ను మంజూరు చేయడంలో భారత్ విఫలమైందని పేర్కొన్నారు. అంతేకాదు నాడు సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ) కింద భారతదేశ రీజనబుల్ మార్కెట్ యాక్సెస్‌ను ట్రంప్ రద్దు చేశారు. ఆనాడు ట్రంప్ విమర్శల తర్వాత భారత్ దిగొచ్చింది. దిగుమతి చేసుకున్న బైక్‌లపై కస్టమ్స్ సుంకాన్ని 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది. అయితే ఇప్పుడు ట్రంప్ మరోసారి భారత్ విధిస్తున్న సుంకాలపై ప్రశ్నలను లేవనెత్తారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ గణనీయమైన సుంకాన్ని విధిస్తోందని చెప్పారు. అమెరికా కూడా భారత ఉత్పత్తులపై అదే స్థాయిలో పన్నులు విధించాలన్నదే తన అభిప్రాయం అని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి హార్లే-డేవిడ్‌సన్ బైక్‌పై విధించే సుంకాన్ని ట్రంప్ ఉదాహరణగా చెప్పారు.

ట్రంప్

అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా భారత్ పన్ను విధానం: ట్రంప్

హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లపై భారత్ 200శాతం టారీఫ్‌లను విధిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ భారత్‌లో తయారైన మోటార్‌సైకిళ్లు ఎలాంటి పన్ను లేదా సుంకం లేకుండా అమెరికాకు వస్తాయని అన్నారు. దీని తాము ఆరా తీస్తే, భారతదేశంలో ప్లాంట్‌ని స్థాపించడం కోసమే ఇలా అధిక సుంకాలను విధిస్తున్నట్లు తెలిసిందని ట్రంప్ అన్నారు. ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున తాను దీన్ని వ్యతిరేకించినట్లు చెప్పారు. అమెరికాపై భారతదేశం 200 శాతం ఛార్జీ విధించినప్పుడు వారి ఉత్పత్తులపై ఎటువంటి సుంకాలను విధించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యానికి విరుద్ధంగా భారత పన్ను విధానం ఉన్నట్లు ట్రంప్ నొక్కి చెప్పారు.