America: అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు, సౌకర్యాల వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంలో, అమెరికా అధ్యక్షుడికి అందే జీతభత్యాలు, సౌకర్యాలు, ఇతర దేశాల ప్రభుత్వాధినేతలతో పోల్చితే అదనపు ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం చాలా మందికి ఆసక్తి కలిగిస్తుంది.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు, భద్రతా ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం.
వివరాలు
సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాధినేతలే టాప్
అమెరికా అధ్యక్షుడు ఏటా 4 లక్షల డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు)గౌరవ వేతనం పొందుతారు.
అంటే ప్రతి నెలా ఆయనకు సుమారు రూ.30 లక్షల వేతనం చెల్లిస్తారు.2001 నుంచి ఈ వేతనం స్థిరంగా ఇవ్వబడుతోంది.
కొన్ని దేశాలలో ప్రభుత్వాధినేతలు ఈ వేతనానికి మించి కూడా తీసుకుంటున్నారు.
ఉదాహరణకు,సింగపూర్ ప్రధానమంత్రి వార్షికంగా రూ.13.85 కోట్లు పొందుతారు,ఇది సింగపూర్ ప్రజల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 1,320శాతానికి సమానం.
అమెరికా అధ్యక్షుడి వేతనం ప్రజల తలసరి జీడీపీకి 606 శాతంగా ఉంటుంది.అదే సమయంలో,కెన్యా అధ్యక్షుడి వేతనం దేశ ప్రజల తలసరి జీడీపీకి 2,360 శాతంగా ఉంటుంది.
హాంకాంగ్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వేతనం రూ.6 కోట్లు,స్విట్జర్లాండ్ అధ్యక్షుడి వేతనం రూ.4.93కోట్లు, ఆస్ట్రేలియా అధ్యక్షుడి వేతనం రూ.3.57కోట్లు ఉంటుంది.
వివరాలు
అదనపు భత్యాలు
అమెరికా అధ్యక్షుడు జీతంతో పాటు అనేక అదనపు భత్యాలను కూడా పొందుతారు.
వ్యక్తిగత, కార్యాలయ భత్యంగా ఆయనకు రూ.43 లక్షలు అందుతాయి.
దేశాధ్యక్షుడి ప్రయాణ ఖర్చులకు పన్ను మినహాయింపు ద్వారా రూ.86 లక్షలు అందుతాయి.
కార్యక్రమాల నిర్వహణ, వినోద ఖర్చులకు ఏటా రూ.16 లక్షలు, వైట్ హౌస్ అలంకరణ ఖర్చుల కోసం మరో రూ.86 లక్షలు యూఎస్ ప్రెసిడెంట్‌కు అందిస్తారు.
ఈ మొత్తాలను మొత్తం చేసుకుంటే, అమెరికా అధ్యక్షుడికి ఏటా సుమారు రూ.4.92 కోట్లు దాకా అందుతాయి.
వివరాలు
వసతి, భద్రత, మరిన్ని సౌకర్యాలు
అమెరికా అధ్యక్షుడికి వసతి, నివాస సౌకర్యాలు అందించబడతాయి. ఆయనకు ఎయిర్ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ సర్వీసు, సాయుధ లగ్జరీ కార్లు కూడా అందిస్తారు.
అంతేకాకుండా, అమెరికా సీక్రెట్ సర్వీస్ ద్వారా ఆయనకు భద్రతా ఏర్పాట్లు కల్పిస్తారు.
ఆయన ఆరోగ్య ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది.
మాజీ అధ్యక్షులకు మంజూరు అవుతున్న సౌకర్యాలు
అమెరికా అధ్యక్షుడిగా సేవలు ముగిసిన తరువాత,ఆయన్ను వృద్ధి లేదా పునరావాసం కొరకు ఏటా రూ.1.99 కోట్ల వరకు పెన్షన్ అందిస్తుంది.
అలాగే, ఆయన్ని ఉచిత వైద్య వసతితో పాటు,ఆఫీసు స్థలం కూడా ఇస్తారు.ఆఫీసులో పనిచేసే సిబ్బందికి వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది.
మాజీ అధ్యక్షులు పుస్తకాల అమ్మకాలు, ప్రసంగాలు లేదా ఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతారు.