LOADING...
Donald Trump: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. 7 ఇరాన్ బోట్లను పేల్చమన్న ట్రంప్
హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. 7 ఇరాన్ బోట్లను పేల్చమన్న ట్రంప్

Donald Trump: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. 7 ఇరాన్ బోట్లను పేల్చమన్న ట్రంప్

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు చెందిన ఏడు వేగవంతమైన బోట్లను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం మూసివేయబడిన నేపథ్యంలో, అక్కడ చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తరలించేందుకు అమెరికా చర్యలు చేపడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), దక్షిణ కొరియాకు చెందిన నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇరాన్ దాడుల కారణంగా ఫుజైరా ఆయిల్ పోర్ట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు యూఏఈ తెలిపింది.

వివరాలు

ఇరాన్ మంత్రి ఏమన్నాడంటే..

"ప్రాజెక్ట్ ఫ్రీడమ్"లో భాగంగా హోర్ముజ్ జలసంధిలో ఉన్న కొన్ని నౌకలను అమెరికా సురక్షితంగా తరలిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా మెయర్స్ కంపెనీకి చెందిన ఒక భారీ నౌక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హోర్ముజ్ దాటినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు త్వరగా సర్దుబాటు అవుతాయనే ఆశలు లేవని, ఈ రాజకీయ ఉద్రిక్తతను సైనిక చర్యల ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరగాచీ పేర్కొన్నారు.

వివరాలు

యూఏఈపై.. డ్రోన్, క్షిపణి దాడులు

ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే సోమవారం యూఏఈపై డ్రోన్, క్షిపణి దాడులు జరగడంతో ఆ ఒప్పందం ఇంకా అమల్లో ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై అమెరికా నౌకాదళ అధికారి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే ఐఆర్జీసీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించి, తమ రక్షణలో ఉన్న నౌకలపై డ్రోన్లు, చిన్న పడవల ద్వారా దాడి చేసిందని తెలిపారు. కానీ ఆ ప్రయత్నాలను అమెరికా సేనలు విజయవంతంగా అడ్డుకున్నాయని కూపర్ పేర్కొన్నారు.

Advertisement