Donald Trump: 'ఫిఫా పీస్ అవార్డు' విజేతగా డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచకప్ వేడుకల్లో అవార్డు ప్రదానం
ఈ వార్తాకథనం ఏంటి
హంమ్మయ్య... చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక అవార్డు దక్కినట్టైంది. రెండోసారి వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 'ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపాను... నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలని నమ్మకంగా భావించారు కూడా. కానీ ఫలితం వేరుగా వచ్చింది. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోనే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్నారు. దీంతో ట్రంప్ కలలపై నీళ్లు చల్లినట్లైంది. అయితే ఆలస్యమైనా మంచిదేనని చెప్పుకోవాలి. 2025లో ట్రంప్‌కు తీపి కబురు వచ్చింది. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో తాజాగా చేసిన ప్రకటన ప్రకారం—ఫిఫా తొలి "శాంతి బహుమతి"ని ట్రంప్‌కు అందించబోతున్నారు.
Details
డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం
2026 ఫిఫా వరల్డ్ కప్ ఏర్పాట్లలో భాగంగా వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంలో వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఇన్‌ఫాంటినో, ట్రంప్‌కి తొలి ఫిఫా శాంతి బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త విని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.
Details
ఫిఫా శాంతి బహుమతి ఉద్దేశం ఇదే
ఫిఫా గత నవంబర్ 5న ఈ సంవత్సరం నుంచే శాంతి బహుమతిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ శాంతి కోసం అసాధారణమైన, ముఖ్యమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. శాంతి స్థాపన కోసం గణనీయంగా శ్రమించే వారికి ఈ పురస్కారం అందజేస్తామని తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగానే తొలి ఫిఫా శాంతి బహుమతిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక చేసినట్లు ఇన్‌ఫాంటినో ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవిలో జరగనున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో ఈ అవార్డును ట్రంప్‌కు అందజేయనున్నారు.
Details
ట్రంప్ స్పందన ఇదే
అవార్డు ప్రకటించిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ—ఇది తన జీవితంలో అందుకున్న గొప్ప గౌరవాల్లో ఒకటని పేర్కొన్నారు. అయితే అవార్డుల కంటే కూడా లక్షలాది ప్రాణాలను రక్షించినందుకు తనకు ఎక్కువ సంతృప్తి ఉందని తెలిపారు. వివాదాలు చెలరేగిన తీరు అయితే ట్రంప్‌కు అవార్డు ప్రకటించిన తర్వాత వివాదాలు తలెత్తాయి. ఈ నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని ఆరోపణలు రావడం ప్రారంభమైంది. మొత్తం 37 మంది సభ్యులతో ఉన్న ఫిఫా కౌన్సిల్ అనుమతి లేకుండానే ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో స్వతంత్రంగా ఈ ప్రకటన చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.