
Yahya Sinwar: సోఫాలో కూర్చొని యాహ్యా సిన్వార్ చివరి క్షణాలు..డ్రోన్ వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ (Israel-Hamas Conflict)తో యుద్ధంలో హమాస్ (Hamas)కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మిలిటెంట్ గ్రూప్ నాయకుడు, అక్టోబర్ 7న జరిగిన దాడుల ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) చంపాయి.
చనిపోయే ముందు సిన్వర్ చేసిన చివరి కదలికలను చూపించే వీడియోలు బయటపడ్డాయి.
ఈ దృశ్యాలు ఇజ్రాయెల్ డ్రోన్ ద్వారా రికార్డు అయినట్లు తెలుస్తోంది. శిథిలమైన ఓ భవనంలో, సోఫా మీద కూర్చుని ఉన్న సిన్వర్‌ను డ్రోన్ చిత్రీకరించింది.
అతను ఆ దృశ్యాలను గమనించిన తర్వాత, కర్రలాంటి ఒక ఆయుధాన్ని డ్రోన్ వైపు విసిరినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Yahya Sinwar lived and died as a warrior. Facing down the Israeli drone in his last moment, threw a stick at it with his final strength. pic.twitter.com/eIesUx2BT4
— Hannah Kim (@K72792215Kim) October 18, 2024