Video: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా దుబాయ్‌లో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి జరపడం పరిస్థితులను ఆందోళనకరంగా మార్చింది. యూఎస్ కాన్సులేట్ సమీపాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా మొదటగా వెల్లడించింది. దాడి అనంతరం భారీ మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్నిమాపక,అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
వివరాలు
రియాద్ లోని అమెరికా ఎంబసీపై డ్రోన్‌లతో దాడి
డ్రోన్ దాడి కారణంగా కాన్సులేట్ సమీపంలో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ దాడి జరిగిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే, కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కాన్సులేట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో భయాందోళనలకు గురై ప్రజలు పరుగులు తీశారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. ఇక ఇదే తరహాలో మంగళవారం రియాద్ లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ రెండు డ్రోన్‌లతో దాడి చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
సీఐఏ స్టేషన్‌పై మరో దాడి
సౌదీ అరేబియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరోసారి దాడికి పాల్పడింది. రియాద్‌లోని యూఎస్ ఎంబసీ ప్రాంగణంలో ఉన్న Central Intelligence Agency (సీఐఏ) స్టేషన్‌పై రెండు డ్రోన్‌లు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో దట్టమైన పొగ వ్యాపించిందని, భవనానికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. మొత్తం మీద వరుస డ్రోన్ దాడులతో పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దుబాయ్‌లలో అమెరికా స్థావరాలపై డ్రోన్ దాడులు
#Watch | A drone attack near the US Consulate in Dubai caused a fire late Tuesday as Iran continued its drone and missile attacks targeting American diplomatic missions in the Middle East. This follows attacks on the US Embassy in Kuwait and Riyadh on Monday and Tuesday pic.twitter.com/Ox4SJkG9Q3
— NDTV (@ndtv) March 4, 2026