Page Loader
Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు! 
Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు!

Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుండి దూకినట్లు న్యూయార్క్ పోస్ట్‌ నివేదించింది. ప్రయాణీకుడు జనవరి 8న టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్‌ కెనడా విమానం నుండి ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల నుంచి కింద పడిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విమాన సిబ్బంది,పీల్ ప్రాంతీయ పోలీసులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Details 

విమానంలో కుటుంబ సభ్యులపై దాడి చేసిన యువకుడు 

ఈ సంఘటన కారణంగా బోయింగ్ 747 టేకాఫ్‌కు దాదాపు ఆరు గంటల ఆలస్యమైంది. కాగా, కొద్ది రోజుల క్రితం ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల యువకుడు తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఎయిర్ కెనడా ఫ్లైట్ 137 టొరంటో నుండి కాల్గరీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.