Loading...
World's Most Wanted Girlfriend: అమెరికా అధికారుల అదుపులో డచ్ మోడల్ వెరా డిజ్క్‌మాన్స్
అమెరికా అధికారుల అదుపులో డచ్ మోడల్ వెరా డిజ్క్‌మాన్స్

World's Most Wanted Girlfriend: అమెరికా అధికారుల అదుపులో డచ్ మోడల్ వెరా డిజ్క్‌మాన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే 'మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్'గా గుర్తింపు పొందిన డచ్ మోడల్ వెరా డిజ్క్‌మాన్స్‌ను అమెరికా అధికారులు నిర్బంధించారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా విమానంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అనంతరం తనను డెలానీ హాల్ నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుతున్నారని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వెరా నిర్బంధంపై ఆమె కుటుంబ సభ్యులు కూడా స్పందించారు.

వివరాలు 

గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌కు హాజరుకాకపోవడమే కారణమా?

అసలు ఏ కారణంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వెరా టూరిస్ట్ వీసాపై అమెరికాలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

వెరా ఇటీవల గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇమిగ్రేషన్ అధికారులు కేటాయించిన అపాయింట్‌మెంట్‌కు ఆమె హాజరుకాలేదని వెరా తల్లి వెల్లడించారు.

ఈ కారణంగానే అమెరికా అధికారులు ఆమెను నిర్బంధించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై అమెరికాలోని డచ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ తమకు సరైన సహాయం అందలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.

వివరాలు 

గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌కు హాజరుకాకపోవడమే కారణమా?

ఈ ఆరోపణలపై డచ్ రాయబార కార్యాలయ ప్రతినిధి స్పందించారు.

వెరా వ్యవహారం గురించి నెదర్లాండ్స్ ప్రభుత్వానికి సమాచారం ఉందని తెలిపారు. ఆమెకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

అయితే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు ఉండటంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా టూరిస్ట్ వీసాపై వెళ్లిన విదేశీయులు అక్కడ ఆదాయం సంపాదించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే నిబంధన ఉంది.

ఈ నేపథ్యంలో వెరా డిజ్క్‌మాన్స్‌ను నిర్బంధించడానికి ఇదే కారణమా? లేక గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌కు హాజరుకాకపోవడంతో ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

60 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

వెరా డిజ్క్‌మాన్స్ సోషల్ మీడియాలోనూ మంచి గుర్తింపు సంపాదించారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సుమారు 60 లక్షల మంది అనుసరిస్తున్నారు.

గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తనతో డేటింగ్ చేయాలంటూ ఏకంగా 5,000 మంది దరఖాస్తులు పంపించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తనను తాను 'మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్'గా అభివర్ణించుకున్నారు.

దీంతో ఆమె పేరు అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో ఆమె నిర్బంధ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT