
Canada: కెనడాలో ముందస్తు ఎన్నికలు.. ఏప్రిల్ 28న పోలింగ్?
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా (Canada) ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) త్వరలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సూచనలున్నాయి. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటులోని 338 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా కార్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
కెనడా రాజధాని ఒట్టావా నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
Details
లిబరల్ పార్టీ ప్రకటన
జస్టిన్ ట్రూడో (Justin Trudeau) జనవరిలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ కొత్త నాయకుడిగా మార్క్ కార్నీని ఎన్నుకుంది.
శనివారం లిబరల్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
కొత్త నాయకత్వంలో లిబరల్ పార్టీ ప్రజాదరణ పెరుగుతుండగా.. గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేలో 42 శాతం మంది లిబరల్ పార్టీకి మద్దతు తెలిపారు.
కన్జర్వేటివ్ పార్టీకి 36 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మార్క్ కార్నీ నాయకత్వాన్ని 48 శాతం మంది సమర్థిస్తుండగా.. 30 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
Details
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తత
ఇదిలాఉండగా, అమెరికా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో (Mexico) దిగుమతులపై మార్చి 4 నుంచి 25 శాతం సుంకాలు విధించనున్న విషయం తెలిసిందే.
వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించడంలో కెనడా విఫలమైతే, ఆ దేశాన్ని అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేయాలని ట్రంప్ విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 28 ఎన్నికలు కీలకంగా మారాయి.