LOADING...
Ecuador Shooting: ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస 
ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస

Ecuador Shooting: ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో కొందరు దుండగులు ఆదివారం రాత్రి నైట్‌క్లబ్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు,మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన గయా ప్రావిన్స్‌లోని శాంటా లూసియా ప్రాంతంలో సంభవించింది. ఈ ప్రాంతాన్ని ఈక్వెడార్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తిస్తారు. పోలీసులు తెలిపినట్లు,బాధితుల వయసు 20 నుంచి 40 మధ్య ఉంది.

వివరాలు 

గతేడాది 7,000 మంది చనిపోయారు

ద్విచక్రవాహనాలపై వచ్చిన సాయుధులైన దుండగులు ఒక్కసారిగా జరిపి పరారయ్యారని అక్కడి మీడియా పేర్కొంది. ఇటీవల కాలంలో ఈక్వెడార్‌లో వరుసగా అల్లర్లు జరుగుతున్నాయి, అయితే తాజా ఘటనకు ప్రత్యేక కారణాలు తెలియాల్సి ఉంది. సుమారు 1.8 కోటి జనాభా ఉన్న ఈక్వెడార్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 4600 మంది అల్లర్ల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 7,000 మంది చనిపోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు