LOADING...
Louisiana: అమెరికాలో కాల్పుల కలకలం: 8 చిన్నారులు సహా 10 మంది మృతి
అమెరికాలో కాల్పుల కలకలం: 8 చిన్నారులు సహా 10 మంది మృతి

Louisiana: అమెరికాలో కాల్పుల కలకలం: 8 చిన్నారులు సహా 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లూసియానా రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనలో 8 మంది చిన్నారులతో కలిపి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఏడాది నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులు ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అధికారుల వివరాల ప్రకారం, ఇళ్ల యజమానుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ కాల్పులకు కారణమయ్యాయి. కాల్పుల వివరాలు సేకరిస్తున్నట్లు ష్రీవ్‌పోర్ట్‌ పోలీస్‌ చీఫ్‌ వేన్‌ స్మిత్‌ చెప్పారు. ఈ ఘటన ష్రీవ్‌పోర్ట్‌ నగరంలో చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం నిందితుడు అపహరించిన కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు.

వివరాలు 

అయోవా వర్సిటీ వద్ద..

వెంటపడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. University of Iowa సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పెద్ద గొడవ చోటుచేసుకుని కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగిలి గాయపడిన పలువురిని ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి ఖచ్చిత సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement