Page Loader
Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ 
అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2025
07:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఈ పార్టీకి 'ది అమెరికా పార్టీ' అని పేరు పెట్టారని ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో అసలైన ప్రజాస్వామ్యం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన స్వేచ్ఛ కల్పించాలనే సంకల్పంతోనే ఈ రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'కు మద్దతు తెలిపితే కొత్త పార్టీని ప్రకటిస్తానని మస్క్ చెప్పిన విషయం తెలిసిందే.

వివరాలు 

 80 శాతం మంది వోటర్లు అనుకూలంగా ఓటు

ఇప్పుడు ఆయన ఆ మాట ప్రకారమే 'ది అమెరికా పార్టీ' పేరును ప్రకటించారు. గతంలో ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో మస్క్ ఓ పోలింగ్ నిర్వహించారు. అందులో ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించాలని అనుకుంటున్న విషయంపై ప్రజాభిప్రాయం కోరారు. ఆశ్చర్యకరంగా 80 శాతం మంది వోటర్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. అదే సమయంలో మస్క్ చేసిన 'ది అమెరికా పార్టీ' అనే పోస్టు అప్పట్లోనే విస్తృతంగా చర్చకు దారి తీసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌

వివరాలు 

ట్రంప్ సంతకంతో చట్టరూపం

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చివరికి సాకారం అయింది. రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అభివర్ణించిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు' ఇప్పుడు అధికారికంగా చట్టంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు.. జూలై 4న దేశ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ట్రంప్ తన సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా ట్రిలియన్ల డాలర్ల విలువైన పన్ను మినహాయింపులు అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా, 1.2 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన మెడికేడ్‌ (Medicaid)ఆహార కూపన్లపై ఖర్చులను భారీగా తగ్గించేందుకు ఉద్దేశించిన చట్టమిది.

వివరాలు 

3.3 ట్రిలియన్ డాలర్ల ద్రవ్య లోటు తగ్గగలదని అంచనా 

వలస సేవల విభాగానికి మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు కూడా ఈ చట్టం సూచిస్తోంది. కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం అంచనాల ప్రకారం, ఈ చట్టం వల్ల వచ్చే పదేళ్లలో సుమారు 3.3 ట్రిలియన్ డాలర్ల ద్రవ్య లోటును తగ్గించగలదని అంచనా. అయితే, దీనివల్ల సుమారు 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరమవుతారని స్పష్టంగా తెలిపింది.