Elon Musk: భారత్‌లో ఉగ్రవాదులు స్టార్‌లింక్ వాడుతున్నారన్న వార్తలు అవాస్తవం: ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఉగ్రవాదులు స్టార్‌లింక్ సేవలను వినియోగిస్తున్నారన్న వార్తలను స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఖండించారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.భారత్‌లో ప్రస్తుతం స్టార్‌లింక్ సిగ్నల్స్ నిలిపివేసి ఉన్నాయని,అలాంటప్పుడు ఎవరైనా ఏ కారణంతోనైనా ఆ సేవలను ఉపయోగించారనడం అసత్యమని ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఇటీవల మణిపూర్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న తిరుగుబాటు గ్రూపుల వద్ద భారత భద్రతా బలగాలు స్టార్‌లింక్ టెర్మినల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలోనే మస్క్ స్పందించారు.అయితే,ఒక ప్రాంతంలో శాటిలైట్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోతే కేవలం స్టార్‌లింక్ టెర్మినల్ తమ వద్ద ఉన్నంత మాత్రాన ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
సేవలు ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి
ఇదిలా ఉండగా,అక్టోబర్ 7న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026లో స్పేస్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ మాట్లాడారు.
భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా దేశంలో ఇప్పటికే 20గేట్‌వే సైట్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
వినియోగదారుల డేటా భారత సరిహద్దులు దాటి వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి అవసరమైన టెలికాం అనుమతులు,స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తయిన వెంటనే భారత్‌లో వాణిజ్య స్టార్‌లింక్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పేస్‌ఎక్స్ తెలిపింది.
దేశంలో ఇంకా దాదాపు 11,000గ్రామాలకు 4జీకవరేజీ అందుబాటులో లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అత్యంత మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడంలో స్టార్‌లింక్ కీలకంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్
Starlink beams are turned off over India, so the claim that they were used by anyone for any reason is absolutely false https://t.co/hiUiyMDGF8 pic.twitter.com/y3R2L5JV7h
— Elon Musk (@elonmusk) October 7, 2026