Elon Musk: ట్రంప్‌తో విభేదాల తర్వాత.. వైట్‌హౌస్ డిన్నర్‌లో పాల్గొన్న ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump),టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే. ఒక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య పెరిగిన భేధాభిప్రాయాలు వారిని మిత్రుల నుంచి ప్రత్యర్థుల దిశగా నెట్టేశాయి. ఈ తగాదాల తర్వాత మస్క్ వైట్ హౌస్ (White House)కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌తో విభేదాలు వచ్చిన తర్వాత మస్క్ మొదటిసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు. అక్కడ నిర్వహించిన విందులో ఆయన పాల్గొన్నారు.
వివరాలు
విందుకు మస్క్, రొనాల్డో, ఎన్విదియా సీఈఓ హాజరు
అంతేకాక, సుమారు ఏడు సంవత్సరాల తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన గౌరవార్థం ట్రంప్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు మస్క్ కూడా హాజరుకావటం ఆసక్తికర అంశంగా మారింది. మస్క్‌తో పాటు పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ఎన్విదియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఆ విందులో పాల్గొన్నారు.