Page Loader
Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్‌ పశ్చాత్తాపం..
'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్‌ పశ్చాత్తాపం..

Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్‌ పశ్చాత్తాపం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ మధ్య సంబంధాలు ఇటీవల పూర్తిగా బీటలు వారిన విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధం ఇక తిరిగి బలపడే అవకాశం లేదేమో అనే స్థాయికి చేరుకుంది. అయితే ఈ పరిస్థితుల్లో మస్క్‌ తన ఆగ్రహావేశంలో ట్రంప్‌పై చేసిన విమర్శలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆయన తన అభిప్రాయాలు హద్దులు దాటి పోయాయని, తాను చేసిన వ్యాఖ్యలు తగినవికాదని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. దీనితో పాటు, ట్రంప్‌తో తలెత్తిన ఈ వివాదం పరిష్కారానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన  మస్క్‌ 

అమెరికా ప్రభుత్వం రూపొందించిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'పై మస్క్‌ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయనకు, ట్రంప్‌కు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మస్క్‌ ట్రంప్‌పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సెక్స్‌ సంబంధిత ఘోరమైన కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేరుపొందిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నాయని మస్క్‌ ఆరోపించారు. దర్యాప్తుల్లో వెలుగు చూసిన కొన్ని విషయాలను ఇప్పటికీ వెల్లడించలేదని, ఆ సమాచారం పబ్లిక్‌కు అందడం లేదని విమర్శించారు. భవిష్యత్తులో వాటి గురించి నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. ఇదే సందర్భంలో ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్‌ చేసిన సూచనను మస్క్‌ సమర్థించడం గమనార్హం.

వివరాలు 

మస్క్‌ లేకపోయినా పెన్సిల్వేనియాలో గెలిచేవాడిని : ట్రంప్ 

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌కు తన మద్దతు లేకపోతే రిపబ్లికన్ పార్టీ ఓడిపోయేదని మస్క్‌ వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. తన విజయానికి మస్క్‌ మద్దతు అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.తనకు మస్క్‌ లేకపోయినా పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని పేర్కొన్నారు. అంతేకాకుండా,మస్క్‌ వ్యాపారాల కోసం ఇచ్చే ప్రభుత్వ ఒప్పందాలు,ప్రోత్సాహకాలు(సబ్సిడీలు) తగ్గించే విషయాన్ని కూడా హెచ్చరించారు. మస్క్‌ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురవ్వడంతో,ఆయన ట్రంప్‌పై చేసిన కొన్ని తీవ్ర ఆరోపణలతో కూడిన పోస్టులను తొలగించారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తాజాగా చేసిన'వెనక్కి తగ్గే' ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటనతో ఇద్దరి మధ్య తిరిగి స్నేహ పునరుద్ధరణకు మార్గం సాఫల్యమవుతుందా అన్న ప్రశ్న చర్చకు వస్తోంది.