LOADING...
Elon Musk: డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ కాల్‌లో ఎలాన్ మస్క్ ఎంట్రీ..?
డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ కాల్‌లో ఎలాన్ మస్క్ ఎంట్రీ..?

Elon Musk: డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ కాల్‌లో ఎలాన్ మస్క్ ఎంట్రీ..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కాల్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఈ ఫోన్‌కాల్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ పరిణామాలపై మోదీ-ట్రంప్ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి తెరిచి ఉండాల్సిన అవసరంపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.

వివరాలు

గతంలో మస్క్-ట్రంప్ మధ్య విభేదాలున్నట్లు వార్తలు

ఇలాంటి సున్నితమైన జాతీయ భద్రతా అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో, ఒక వ్యాపారవేత్తగా మస్క్ ఈ కాల్‌లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మస్క్ ఎందుకు ఇందులో చేరారు?ఆయన ఏమి మాట్లాడారు? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ట్రంప్-మోదీ సంభాషణపై విడుదలైన అధికారిక ప్రకటనల్లో మస్క్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో మస్క్-ట్రంప్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, తాజా పరిణామం వారి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయనే సంకేతంగా భావిస్తున్నారు. ఈఅంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. మోదీ-ట్రంప్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, వారి చర్చలు ఫలప్రదంగా జరిగాయని మాత్రమే తెలిపారు.

Advertisement