Loading...
Elon Musk: కారణం చెప్పకుండా సడన్‌గా బ్రేకప్‌ చెప్పిన ఎలాన్ మస్క్‌.. షాకింగ్ రివీల్!
కారణం చెప్పకుండా సడన్‌గా బ్రేకప్‌ చెప్పిన ఎలాన్ మస్క్‌.. షాకింగ్ రివీల్!

Elon Musk: కారణం చెప్పకుండా సడన్‌గా బ్రేకప్‌ చెప్పిన ఎలాన్ మస్క్‌.. షాకింగ్ రివీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ప్రస్తుత భాగస్వామి శివోన్ జిలిస్ (Shivon Zilis)తో బంధం ముగిసినట్లు తెలుస్తోంది. ఎలాంటి కారణం చెప్పకుండా, బ్రేకప్ గురించి ముందుగా ఎలాంటి చర్చ కూడా లేకుండానే మస్క్ తనతో బంధాన్ని ముగించారని శివోన్ తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఎలాంటి చర్చ లేకుండా వారం రోజుల్లోనే ప్రేమలో నుంచి బయటకు వచ్చేయడం ఎంతో కష్టం. కానీ కొన్ని పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎంతో బాధగా ఉంది. E (ఎలాన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ) అంటే నాకు చాలా ఇష్టం.

వివరాలు

ఎలాన్ సంతోషంగా ఉండాలి

ఎన్నో జన్మలకు సరిపడా జ్ఞానాన్ని నేర్పించి, నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఎలాన్ సంతోషాన్ని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను.

ఈ ప్రపంచానికి ఆయన ఒక వరం. బయట ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. ఇంట్లో ఆయన ప్రశాంతంగా ఉండేలా నేను, మా పిల్లలు చూసుకున్నాం.

ఈ బంధం నుంచి దూరంగా కావడం నాకు లోటే. మేం మంచి స్నేహితులుగా ఉండి, పిల్లలకు తోడుగా ఉంటామని ఆశిస్తున్నాను" అంటూ శివోన్ తమ బ్రేకప్ గురించి వెల్లడించారు.

వివరాలు

ఓపెన్‌ఏఐలో పరిచయం.. న్యూరాలింక్‌లో కీలక బాధ్యతలు

యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన శివోన్ జిలిస్.. ఓపెన్‌ఏఐలో పనిచేసిన సమయంలో ఎలాన్ మస్క్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

ఆ తర్వాత వీరిద్దరూ సహజీవనం కొనసాగించారు. 2017లో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో శివోన్ చేరారు.

ఈ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు కొనసాగుతున్నాయి. న్యూరాలింక్‌లో ఆమె డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

కెనడాలో పెరిగిన శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి పంజాబీ. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్‌కు మొత్తం నలుగురు సంతానం ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మ

2021 నవంబర్‌లో శివోన్ జిలిస్ ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు జన్మించారు.

వీరిలో ఒక కుమారుడి పేరులో 'శేఖర్' అనే పదం ఉంటుంది.

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఆ పేరును పెట్టినట్లు ఎలాన్ మస్క్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు.

ADVERTISEMENT