Page Loader
Iran-Israel: 'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ

Iran-Israel: 'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో,పశ్చిమాసియా ప్రాంతం వేడెక్కుతోంది. ఇజ్రాయెల్‌ చేస్తున్నవరుస దాడుల ప్రభావంతో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నగరం దద్దరిల్లుతోంది. ఈసంక్షోభ పరిస్థితుల్లో అక్కడ ఉన్న భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని,భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ విడుదల చేసింది. ఈహెచ్చరికలో టెహ్రాన్‌లో ఉన్న భారతీయ పౌరులు,పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో టెహ్రాన్‌ను విడిచి,అత్యవసరంగా అక్కడినుండి బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. టెహ్రాన్‌కు వెలుపల ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఎంబసీ సూచించింది. ఇంకా ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని వారు వెంటనే భారత దౌత్యాధికారులతో సంప్రదించాలని కోరింది. వారు ప్రస్తుతం ఉన్ననివాస స్థలాల వివరాలు,ఫోన్‌ నంబర్లు వంటి కీలకసమాచారం వెంటనే షేర్‌ చేయాలని ఎంబసీ విజ్ఞప్తి చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎంబసీ చేసిన ట్వీట్