LOADING...
Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్ తన్నులు తిన్నారు.ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాక్రాన్ దంపతులు నాలుగు రోజుల ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌ చేరుకున్నారు. విమానం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తలుపులు తెరుచుకోగానే, ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్రిగిట్టే మాక్రాన్, ఆమె భర్త ముఖంపై గట్టిగా చెంపదెబ్బలు కొట్టినట్టు కనిపించింది. ఈ ఘటనతో మాక్రాన్ కొంతసేపు ఆగిపోయారు, కానీ వెంటనే తేరుకుని హాయ్ అని పలకరించారు.

వివరాలు 

ఎడముఖం పెడముఖంతోనే విమానం దిగిన మాక్రాన్ దంపతులు 

తర్వాత విమానం నుంచి దిగే సమయంలో మాక్రాన్ తన భార్య చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ఆ ప్రయత్నాన్ని తేలికగా త్రోసిపుచ్చారు. ఇద్దరూ విమానం నుంచి బయటకు వస్తూ ఎడముఖం పెడముఖంతోనే కనిపించారు. బ్రిగిట్టే ముఖంలో ఆగ్రహం స్పష్టంగా కనిపించగా, మాక్రాన్ మాత్రం తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే, మాక్రాన్ దంపతుల మధ్య వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే ఈ సంఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..