Page Loader
Etihad: బోయింగ్ 787 లలో ఇంధన నియంత్రణ స్విచ్‌లతో జాగ్రత్త.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అలర్ట్ 
పైలట్లకు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అలర్ట్

Etihad: బోయింగ్ 787 లలో ఇంధన నియంత్రణ స్విచ్‌లతో జాగ్రత్త.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అలర్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ఏఐ171 విమాన ప్రమాద ఘటనలో...ఇంధన స్విచ్‌లు పనిచేయకపోవడం వల్లే ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బోయింగ్‌ విమానాల్లో ఉన్న ఇంధన సరఫరా స్విచ్‌ల భద్రతాపరమైన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్‌వేస్(Etihad Airways)తమ పైలట్లకు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసింది. బోయింగ్ 787 మోడల్‌ విమానాల్లో ఉండే ఇంధన స్విచ్‌లను అప్రమత్తతతో,అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని పైలట్లకు స్పష్టంగా తెలియజేసినట్లు పలు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతేకాక,తమ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే దానిపై కూడా అధికారులు ప్రత్యేకంగా పరిశీలన చేపట్టినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పైలట్లకు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అలర్ట్