Sheikh Hasina: 20 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్నా : షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఓ ఆడియో ఇటీవల విడుదలైంది. 2024 ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆడియోను ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. షేక్ హసీనా తన ప్రాణాలను కాపాడిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపింది.
తన రాజకీయ ప్రత్యర్థులు ఆమెను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన ఆమె సోదరి రెహానాతో కలిసి దిల్లీ చేరిన విషయం కూడా తెలిసిందే.
Details
నా దేశాన్ని నాశనం చేశారు
ఆమె వీడియోలో కేవలం 20 నుండి 25 నిమిషాల్లోనే ప్రాణాలు బయటపడ్డానని తెలిపింది.
2024 ఆగస్టు 21న జరిగిన ఘటనలు, కోటలిపారాలో బాంబు దాడి, ఆగస్టు 5వ తేదీన జరిగిన అటాక్‌ల నుంచి అల్లా ఆమెను కాపాడినట్లు పేర్కొన్నారు.
2004లో హసీనాపై జరిగిన గ్రేనేడ్ అటాక్‌లో ఆమె గాయాలపాలైంది. ప్రస్తుతం నా దేశం లేదు, నా ఇల్లు లేదని, అన్నింటినీ నాశనం చేశారని ఆ ఆడియోలో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.