Loading...
South Korea: పరీక్షల్లో కాపీయింగ్ అడ్డుకునేందుకు దక్షిణ కొరియా వినూత్న ప్రయోగం
పరీక్షల్లో కాపీయింగ్ అడ్డుకునేందుకు దక్షిణ కొరియా వినూత్న ప్రయోగం

South Korea: పరీక్షల్లో కాపీయింగ్ అడ్డుకునేందుకు దక్షిణ కొరియా వినూత్న ప్రయోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాలో గురువారం (నవంబర్ 19) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలో గురువారం ఒకేసారి మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్‌లు రావడంతో పెద్ద శబ్దంతో అలారాలు మోగాయి. దక్షిణ కొరియాలో నివసిస్తున్న స్థానికులతో పాటు విదేశీయుల మొబైల్ ఫోన్లకూ ఒకేసారి ఎమర్జెన్సీ అలర్ట్‌లు వచ్చాయి. అయితే ఇదంతా ఏదో ప్రమాదం లేదా విపత్తు గురించి హెచ్చరించడానికి కాదు. పరీక్షల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఉపయోగించి ఏఐ సాయంతో కాపీయింగ్ చేయకుండా అడ్డుకునేందుకు అధికారులు వేసిన తెలివైన ఎత్తుగడ ఇది. 2027 కాలేజ్ స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్ (CSAT) సందర్భంగా అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు.

వివరాలు 

అలారంతో కలకలం!

పరీక్షలో మొదటి పేపర్‌కు ముందు, మూడో పేపర్ తర్వాత,నాలుగో పేపర్ సమయంలో ఇలా మొత్తం మూడుసార్లు అలర్ట్‌లు పంపించారు.

దక్షిణ కొరియాలోని విదేశీయులకు కూడా 22భాషల్లో విపత్తు హెచ్చరికలు పంపించే'ఎమర్జెన్సీ రెడీ' యాప్ ద్వారా 10.5సెకన్ల పాటు అలారం వినిపించింది.

సాధారణంగా భూకంపాలు,ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను ఉపయోగిస్తుంది.

అయితే ఈసారి ఫోన్లు సైలెంట్‌లో ఉన్నా,స్విచ్ఛాఫ్ చేసినా పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఏం జరిగిందో తెలియక చాలామంది ఆరా తీశారు.కొందరైతే దేశంలో యుద్ధం మొదలైందేమోనని కూడా భయపడ్డారు.

అయితే ఈ అలర్ట్‌ల వెనుక అసలు ఉద్దేశం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకోవడమే.

వివరాలు 

కాపీయింగ్‌ను పట్టుకునేందుకు అధికారుల తెలివైన ప్లాన్

దక్షిణ కొరియాలో నిర్వహించే సునెంగ్ (Suneung) పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటి. దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగే ఈ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్షల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించి కాపీయింగ్ చేసే అవకాశాన్ని అడ్డుకునేందుకు అధికారులు వినూత్నంగా ఆలోచించారు.

ఫోన్లు సైలెంట్‌లో ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ అలర్ట్ ద్వారా పెద్ద శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

దీంతో విద్యార్థుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు వెంటనే బయటపడ్డాయి.

అంతేకాకుండా రహస్య కెమెరాలు అమర్చిన కళ్లద్దాలు ఏమైనా ఉన్నాయా అని కూడా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలు, ప్రావిన్సుల్లో మొత్తం 22 స్మార్ట్‌ఫోన్లను గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

కెమెరా,ఏఐ సాయంతో పరీక్షలో కాపీయింగ్ చేసిన వ్యక్తి

ఇటీవల జాతీయ స్థాయి ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో ఓ అభ్యర్థి సూక్ష్మ కెమెరా, జనరేటివ్ ఏఐ సాయంతో అత్యధిక మార్కులు సాధించినట్లు అంగీకరించడం ఈ చర్యలకు కారణమైంది.

హాన్ వోన్-సోక్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో విడుదల చేస్తూ, పరీక్షలో ఏఐ సాయంతో కాపీయింగ్ చేసినట్లు వెల్లడించాడు.

ఈ విధంగా 400 మార్కులకు గాను 397.5 మార్కులు సాధించినట్లు చెప్పాడు.

ఇంత భారీ స్కోరు సాధించడం దాదాపు అసాధ్యమని భావించిన నెటిజన్లు, అతడు అక్రమ మార్గాల్లో మార్కులు పొందాడని అనుమానించారు.

తొలుత 34 ఏళ్ల హాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. అయితే చివరకు వీడియో ద్వారా అసలు విషయం బయటపెట్టాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ సాయంతో కాపీయింగ్.. అప్రమత్తమైన దక్షిణ కొరియా అధికారులు

పరీక్ష ప్రశ్నలను చిన్న కెమెరా సాయంతో ఫొటోలు తీసి, వాటిని ఏఐ టూల్‌కు పంపించినట్లు తెలిపాడు.

ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షమయ్యాయని వెల్లడించాడు.

2017లో ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకేసారి సందేశాలు పంపించడం ఇదే తొలిసారి.

దక్షిణ కొరియాలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.

వివరాలు 

పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆంక్షలు.. విమానాల రాకపోకలకూ బ్రేక్!

పరీక్ష జరిగే రోజున ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తారు.

అంతేకాకుండా విద్యార్థులు ఇంగ్లిష్ లిజనింగ్ పరీక్ష రాసే సమయంలో విమానాల రాకపోకలను కూడా నిలిపివేస్తారు.

విమానాల శబ్దం వల్ల విద్యార్థులకు వినికిడి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంటారు.

పరీక్షల నిర్వహణలో ఇంతటి జాగ్రత్తలు తీసుకునే దక్షిణ కొరియా అధికారులు, ఈసారి ఎమర్జెన్సీ అలర్ట్‌లను ఉపయోగించి కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు కొత్త పద్ధతిని అమలు చేశారు.

ADVERTISEMENT