Zuckerberg:ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్ బర్గ్ కి మరణశిక్ష..?
ఈ వార్తాకథనం ఏంటి
మెటా (Meta) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg) తనకు పాకిస్థాన్‌లో (Pakistan) మరణశిక్ష విధించాలని చూస్తున్నారని వెల్లడించారు.
ఎవరో వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్‌పై పాకిస్థాన్‌లో నమోదైన కేసు గురించి కూడా వివరించారు.
వివరాలు
యాప్‌లోని కొంత కంటెంట్‌ను అణచివేయాల్సిన పరిస్థితి
"ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మనం అంగీకరించని వివిధ చట్టాలు ఉన్నాయి.ఉదాహరణకు, పాకిస్థాన్‌లో ఎవరో నాపై మరణశిక్ష విధించాలని కేసు వేశారు.ఫేస్‌బుక్‌లో ఎవరో దేవుడిని అవమానించేలా ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడమే దీని కారణం.ఇది ఎటువైపుకి దారి తీస్తుందో తెలియదు.నాకు ఆదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఎక్కువగా ఆందోళన చెందను. భావప్రకటన స్వేచ్ఛకు తోడు,వివిధదేశాలలో పాటించే సాంస్కృతిక విలువలకు అనుగుణంగా కొన్ని నిబంధనలు కూడా అమల్లో ఉంటాయి.అందువల్ల,యాప్‌లోని కొంత కంటెంట్‌ను అణచివేయాల్సిన పరిస్థితి వస్తోంది.కొన్ని దేశ ప్రభుత్వాలు అమలు చేసే నిబంధనలు చాలా కఠినంగా ఉండటంతో,అవి మమ్మల్ని జైలుకు పంపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.అమెరికా ప్రభుత్వం విదేశాలలో పనిచేస్తున్న అమెరికన్ టెక్ కంపెనీలకు రక్షణ కల్పించాలని నేను భావిస్తున్నాను,"అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
వివరాలు
ఈ మాధ్యమాలను ఉపయోగిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు
గతేడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్థాన్ ఎక్స్ (X), ఫేస్‌బుక్ (Facebook) సహా కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలను నిషేధించింది.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ మాధ్యమాలను ఉపయోగిస్తున్నారని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది.