Plane Crash: కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం (వీడియో)
కజకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్టౌ నగరానికి సమీపంలో ప్రయాణికులతో వెళ్ళి ఉన్న ఒక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా, 12 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోగ మంచు కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.