LOADING...
US: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్

US: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం సుమారు 7:45 గంటల సమయంలో బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న బాంబార్డియర్ ఛాలెంజర్ 600 విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 8 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయ రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు.

Details

ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వైరల్

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. అలాగే విమానంలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. ఈ విమానం హోస్టన్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయ రన్‌వేపై పడిపోయిన శిథిలాల నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Advertisement