LOADING...
FATF: పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆగ్రహం.. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధుల సమకూర్చడంపై గట్టి వార్నింగ్! 
పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆగ్రహం.. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధుల సమకూర్చడంపై గట్టి వార్నింగ్!

FATF: పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆగ్రహం.. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధుల సమకూర్చడంపై గట్టి వార్నింగ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదర్శి సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్‌) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గ్రే లిస్టు నుంచి బయటపడడం ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్‌ చర్యలకు సురక్షిత రక్షణా సూచికలాగా పరిగణించరాదని ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన బంధువులు మహిళలకు ఉగ్రవాదంపై ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించబోతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ ఆన్‌లైన్ కోర్సులకు నిధులు సమకూర్చబడుతున్నట్లు నిఘా నివేదికలు వెల్లడించాయి. ఈ సందర్భంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరికలు రావడం గమనార్హం. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆందోళన ప్రధానంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు డిజిటల్ వాలెట్లు, డిజిటల్ ఫైనాన్స్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం గురించి ఉంది.

Details

గ్రే లిస్టు నుంచి బయటపడిన పాక్

ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడంలో, అలాగే సౌకర్యాల కోసం డిజిటల్ వాలెట్లను వినియోగించడం వంటి అంశాలపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఇప్పటికే ఉన్నాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షురాలు ఎలిసా డి అండా మద్రాజో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. 2022 అక్టోబరులో పాకిస్థాన్‌ గ్రే లిస్టు నుంచి బయటపడింది. ఆ నాటి నుంచి పాక్‌ ఫాలోఅప్ ప్రక్రియలో ఉందని ఆమె పేర్కొన్నారు. గ్రే లిస్టులో ఉండటం, ఆ లిస్టు నుంచి బయటపడటం ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ చర్యలకు బుల్లెట్‌ప్రూఫ్ రక్షణగా పరిగణించకూడదని స్పష్టత ఇచ్చారు. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలు కూడా ఉగ్రవాద నిధుల వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చర్యలను నిరోధించడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబద్ధతతో ఉందని ఆమె పేర్కొన్నారు.