Trump's Movie Roles: ట్రంప్ అతిధి పాత్ర చేసిన సినిమాలు, టీవీ షోలు గురించి తెలుసా?
తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా 1989 నుండి ట్రంప్ పలు సినిమాల్లో కూడా నటించారు. కొన్ని చిత్రాల్లో చిన్నపాత్రల్లో కనిపించినా, మరికొన్ని సినిమాల్లో మాత్రం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆ సినిమాలు ఏవో చూద్దాం. 1989లో విడుదలైన "గోస్ట్స్ కాంట్ డూ ఇట్" అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో ట్రంప్ చిన్న సన్నివేశంలో కనిపించారు.
"ది లిటిల్ రాస్కల్స్" వాల్డో జాన్‌స్టన్ 3 పాత్రకు తండ్రిగా..
1992లో క్రిస్ కొలంబస్ దర్శకత్వం వహించిన "హోమ్ అలోన్ 2," 1994లో "ది లిటిల్ రాస్కల్స్" అనే చిత్రంలో వాల్డో జాన్‌స్టన్ 3 అనే పాత్రకు తండ్రిగా నటించారు. ఈ పాత్రలో ట్రంప్ హాస్యస్ఫదంగా కనిపిస్తారు. 1995లో "ఎక్రాస్ ది సీ ఆఫ్ టైమ్" అనే అడ్వెంచర్ చిత్రంలో,1996లో "ది అసోసియేట్,"1998లో "54," 1998లో "సెలెబ్రిటీ," 2001లో విడుదలైన "జూలాండర్" అనే సినిమాలో ట్రంప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. 2002లో "టూ వీక్స్ నోటీస్," 2010లో "వాల్ స్ట్రీట్: మనీ నెవర్ స్లీప్స్"తో పాటు ఆ తరువాత "ఎడ్డి," "పిఓఎం వండర్‌ఫుల్ ప్రెజెంట్స్," "స్మాల్ పొటాటోస్: హూ కిల్ యూఎస్‌ఎఫ్‌ఎల్?" వంటి పలు చిత్రాల్లో కూడా ఆయన కనిపించారు.