Page Loader
South Korea: విమానంలో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ 176 మంది
విమానంలో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ 176 మంది

South Korea: విమానంలో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ 176 మంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో, ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన అధికారులు వెంటనే చర్య తీసుకొని, విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. విమానం హాంకాంగ్‌కు బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి 10.15 గంటలకు చోటుచేసుకుంది. ప్రయాణీకులను గాలితో నిండిన స్లయిడ్‌లను ఉపయోగించి సురక్షితంగా ఖాళీ చేయించారు.

Details

ప్రమాదానికి గల కారణాలపై విచారణ

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ విమానం 17 సంవత్సరాల పాత ఎయిర్‌బస్ ఏ321 సీఈఓ మోడల్ కాగా, దాని టెయిల్ నంబర్ HL 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ మీడియాకు వెల్లడించింది. గత నెలలో కూడా ఈ విధమైన ఒక ప్రమాదం జరిగింది. 2024 డిసెంబర్ 29న, మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 179 మంది మృతి చెందారు.