Page Loader
సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 
సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ

సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 

వ్రాసిన వారు Stalin
Sep 20, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది. రిపబ్లికన్ ప్రతినిధి జేమ్స్ కమెర్ నేతృత్వంలోని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, విచారణలో రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రశ్నలను అన్వేషించనుంది. అలాగే జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్, అధ్యక్షుడి సోదరుడు జేమ్స్ బైడెన్‌ల వ్యక్తిగత, వ్యాపార బ్యాంకు రికార్డులను కమిటీ తనిఖీ చేయనుంది. 2009- 2017 మధ్య జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు హంటర్ వ్యాపారపరంగా లబ్ధిపొందారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అయితే రిపబ్లికన్ల ఆరోపణను డెమోక్రాట్లు ఖండిస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలో అభిశంసన ప్రక్రియను పొందుపర్చారు. దీని కింద అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుటుంబ సభ్యులు  ఆస్తులపై విచారణ