Page Loader
US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి 
US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి

US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 27, 2023
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. టెక్సాస్ హైవేపై ఘోరమైన ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. చనిపోయిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెళ్లారు. చనిపోయిన వారిని పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మిగా గుర్తించారు. మిగతా వారు నాగేశ్వరరావు కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు