Page Loader
central Sweden: సెంట్రల్ స్వీడన్‌ పాఠశాలలో కాల్పులు.. ఐదుగురు మృతి 
సెంట్రల్ స్వీడన్‌ పాఠశాలలో కాల్పులు.. ఐదుగురు మృతి

central Sweden: సెంట్రల్ స్వీడన్‌ పాఠశాలలో కాల్పులు.. ఐదుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
07:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్లు (125 మైళ్ళు) దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో జరిగిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు స్వీడిష్ పోలీసులు మంగళవారం ధృవీకరించారు . సమాచారం అందుకున్న అంబులెన్సులు, రెస్క్యూ సర్వీసులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. "కాల్పులలో ఐదుగురు వ్యక్తులుమృతి చెందారు" అని పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ప్రస్తుతం "హత్యాయత్నం, దహనం, తీవ్రమైన ఆయుధ నేరాలు"గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

: సెంట్రల్ స్వీడన్‌ పాఠశాలలో కాల్పులు