Page Loader
US Delta plane: ఓర్లాండో విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందు డెల్టా విమానంలో మంటలు.. 282 మంది ప్రయాణికులు సురక్షితం.. 
ఓర్లాండో విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందు డెల్టావిమానంలో మంటలు

US Delta plane: ఓర్లాండో విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందు డెల్టా విమానంలో మంటలు.. 282 మంది ప్రయాణికులు సురక్షితం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే మంటల గురించి సమాచారం సకాలంలో గుర్తించడంతో విమానంలో ప్రయాణిస్తున్న 282 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. అత్యవసర స్లయిడ్‌ల సహాయంతో వారిని సురక్షితంగా విమానం వెలుపలికి తరలించారు.

వివరాలు 

ఘటన వివరాలు 

ఈ సంఘటన సోమవారం, స్థానిక కాలమానం ప్రకారం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఆ విమానం ఆ సమయంలో మంటల్లో చిక్కుకుంది. పరిస్థితి అత్యవసరంగా మారడంతో విమాన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లయిడ్‌ల ద్వారా బయటకు పంపాల్సి వచ్చింది.

వివరాలు 

ఇంజిన్‌కు మంటలు - ఫెడరల్ ఏవియేషన్ ప్రకటన 

విమానం అట్లాంటా నగరానికి వెళ్లే ఉద్దేశ్యంతో రన్‌వేపై టేకాఫ్ అయ్యాక, దాని రెండు ఇంజిన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. కుడివైపు ఉన్న ఇంజిన్ నుంచే ఈ మంటలు వెలువడినట్టు డెల్టా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తును ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని టెర్మినల్‌లో ఉన్న ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో వీడియో రూపంలో నమోదు చేశాడు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని కుడి ఇంజిన్ టెయిల్ పైప్‌లో మంటలు మొదలైన వెంటనే సిబ్బంది అప్రమత్తమై, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా ప్రయాణికులను తక్షణమే బయటకు పంపించారు.

వివరాలు 

ప్రయాణికుల సహకారంపై ఎయిర్‌లైన్స్ స్పందన 

ఈ సంఘటనపై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్, ప్రయాణికులు తమకు ఎంతో సహకరించారని తెలిపింది. ప్రతీ ఒక్కరినీ అభినందించిన సంస్థ, వారికి ఎదురైన ఈ అసౌకర్యానికి గాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరింది. ప్రయాణికుల భద్రత తమకెప్పుడూ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొంది. త్వరలోనే వారికి తుది గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేస్తామన్న మాటను ఇచ్చింది. ఇతర విమానాల ద్వారా ప్రయాణికులను అవసరమైన చోట్లకు తీసుకెళ్తామని వెల్లడించింది. ప్రస్తుతం మంటలు చెలరేగిన ఆ విమానాన్ని నిర్వహణ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై FAA సునిశితంగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డెల్టా విమానంలో మంటలు