Page Loader
Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. 51 మంది మృతి
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. 51 మంది మృతి

Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. 51 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు భారీ ధ్వంసాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా పలువురు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. వందలాది కార్లు వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాలెన్సియాలోని ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలను వెలికి తీస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ అధికారి కార్లోస్ మజోన్ తెలిపారు. దక్షిణ స్పెయిన్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Details

మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం

వాలెన్సియా ప్రాంతంలో మొబైల్ సేవలు నిలిచిపోయాయి, విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వరదల కారణంగా రోడ్లు తెగిపోయాయని కార్లోస్ మజోన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. సిటీ హాల్‌ అన్ని పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలను నిలిపివేసింది. 12 విమానాలను దారి మళ్లించగా, 10 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ సంతాపం వ్యక్తం చేశారు.